క్రైమ్/లీగల్

శిలాఫలకం ధ్వంసం.. బ్యానర్లు చించివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 12: జిల్లాలోని రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంతో పాటు బట్టుతండాలో మంగళవారం శాసనమండలి ప్రతిపక్షనే షబ్బీర్‌అలీ ఎంతో అట్టహాసంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, శిలాఫలకాలు వేశారు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన వేసిన శిలాపలకాలను, బ్యానర్లను చించివేశారు. మండలంలోని బటుతండాలో గిరిజన మహిళలు, పార్టీ కార్యకర్తలు ఎంతో ఘనంగా తమ నాయకునిచే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇది గిట్టని వారు ఎవ్వరో తమ తండాలో తమ నాయకుడు వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేసి, బ్యానర్లు చించివేయడం పట్ల తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంగావత్ రాజు రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజు ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దుండగులను పట్టుకునేంత వరకు తాము ఈ సంఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తామని రాజు అన్నారు. ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి విన్నవించడం జరిగిందన్నారు.