క్రైమ్/లీగల్

ఏటీఎం కార్డు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఫిబ్రవరి 26 : ఏటీఎం కార్డు దొంగిలించి బ్యాంకు ఖాతాలో సొమ్ము అపహరించిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు, స్థానిక విజిలీపేటకు చెందిన రత్నకుమార్ తన ఏటీఎం కార్డు దొంగతనం జరిగిందని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన ఏటీఎం కార్డును ఉపయోగించి తన ఎస్‌బిఐ ఖాతాలోని రూ.1.5 లక్షలు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎలక్ట్రికల్ దుకాణంలో చోరీ
చీరాల, ఫిబ్రవరి 26 : ఓ దుకాణంలో టీవీ దొంగతనం జరిగిన జరిగిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, స్థానిక వైష్ణవి ఎలక్ట్రికల్ దుకాణ నిర్వాహకుడు బి వెంకటేశ్వర్లు ఈ నెల 24వ తేదీన తన తల్లిని దుకాణంలో ఉంచి మధ్యాహ్నం సమయంలో భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. 3 గంటల సమయంలో తన తల్లి ఫోన్ చేసి దుకాణానికి నలుగురు మహిళలు వచ్చి రూ.10 వేల విలువైన ఎల్‌ఇడి టీవీ దొంగిలించారని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాణాసంచా అక్రమ నిల్వలపై దాడులు
* ఇద్దరి అరెస్ట్ * రూ.లక్ష విలువైన బాణాసంచా సీజ్
పామూరు, ఫిబ్రవరి 26: అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచి క్రయవిక్రయాలు జరుపుతున్న ఇరువురిపై ఫైర్ ఆఫీసర్ పోలీసు సిబ్బంది రెవెన్యూ అధికారులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని లక్ష రూపాయల విలువగల బాణాసంచా సామగ్రిని సీజ్ చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి పామూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని మెయిన్ బజారు సెంటర్‌కు చెందిన రెండు దుకాణాల్లో యధేచ్ఛగా అనుమతులు లేని బాణాసంచాలు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో ఫైర్ ఆఫీసర్స్ స్థానిక ఎస్‌ఐని సంప్రదించారు. విఆర్‌ఓ హరితో కలిసి రెండు దుకాణాలపై దాడి చేయగా, నిషేధిత బాణాసంచా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాంబశివయ్య తెలిపారు. ఇటీవల అనుమతి లేని గోడౌన్‌లలో నిల్వ ఉంచిన బాణాసంచా వల్ల పెనుప్రమాదం తప్పిన విషయం విదతమే. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ సాంబశివయ్య హెచ్చరించారు.