క్రైమ్/లీగల్

ఆర్డీఓ కార్యాలయం ఎదుట..రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, సెప్టెంబర్ 15: తమ వ్యవసాయ భూమికి సంబంధించి వివరాలను ఆన్‌లైన్ చేయకుండా రెవిన్యూ సిబ్బంది వేదిస్తున్నారన్న ఆందోళనతో దేవరకొండ మండలం కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సుంకోజు శ్యామలయ్య, ఆయన భార్య రమణలు దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వీరి పరిస్ధితి విషమంగా ఉండడంతో దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు వారిని హైద్రాబాద్‌కు తరలించారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుంకోజు శ్యామలయ్య తల్లి సుంకోజు నారాయణమ్మ పేరు మీద కొమ్మెపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 291/ అ లో 1.22 ఎకరాల లావుణీపట్టా భూమి ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆమె ఈ భూమిని గ్రామానికే చెందిన తన సమీప బంధువులు కొన్ని సంవత్సరాల క్రిందట అమ్మివేసినట్లు వీ ఆర్వో గుర్తించారు. దీంతో ఈ భూమికి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయకుండా వీ ఆర్వో పార్ట్ బీ క్రింద ఈ భూమిని పెట్టారు. అయితే తాము ఎవరికీ భూమిని అమ్మలేదని గ్రామానికి చెందిన కొంత మంది అధికారపార్టీ నాయకులు కక్షగట్టి తమకు పట్టాదారు పాసుపుస్తకం రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నారాయణమ్మ కుమారుడు శ్యామలయ్య మూడు రోజుల క్రితం దేవరకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట క్రిమిసంహారక మందు సేవించేందుకు యత్నించాడు. అప్పుడు కార్యాలయ సిబ్బంది, తోటి వారు శ్యామలయ్యను అడ్డుకున్నారు. తహశీల్దార్ న్యాయం చేస్తానని చెప్పడంతో శ్యామలయ్య తిరిగి వెళ్ళిపోయారు. శుక్రవారం రోజు గ్రామ వీ ఆర్వో నజీర్ నారాయణమ్మ భూమికి సంబంధించిన నూతన పాస్‌పుస్తకాన్ని అందజేశారు. అయితే శుక్రవారం వరకు నారాయణమ్మ పేరు మీద భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపించిందని పాస్‌పుస్తకం ఇచ్చినట్లే ఇచ్చి ఆన్‌లైన్‌లో మాత్రం తమ పేరును తొలగించారని బాధితులు ఆరోపించారు. రెవిన్యూ అధికారులు కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు గురైన శ్యామలయ్య, రమణ దంపతులు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
పీవోటి చట్టానికి లోబడి న్యాయం చేస్తాం : ఆర్డీవో లింగ్యానాయక్
కొమ్మెపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు సుంకోజు శ్యామలయ్య, రమణ దంపతులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనపై ఆర్డీవో లింగ్యానాయక్‌ను వివరణ కోరగా పీవోటి చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నారాయణమ్మ భూమికి సంబంధించి వివాదం ఉండడంతో పాస్‌పుస్తకం జారీ చేయకుండా పార్ట్‌బీలో పెట్టినట్లు చెప్పారు. లావుణీపట్టా భూమికి సంబంధించి విచారణ జరిపి పాస్‌పుస్తకాన్ని రద్దు చేసే అధికారం తహశీల్దార్‌కు ఉండడంతో నారాయణమ్మ పేరు మీద పాస్‌పుస్తకాన్ని జారీ చేసినట్లు చెప్పారు. అయితే ఆన్‌లైన్‌లో పేరును తొలగించే అధికారం ఎవరికీ లేదని నిబంధనల ప్రకారం ఇద్దరికీ నోటీస్‌లు ఇచ్చి వాస్తవాలను తేల్చిన అనంతరం నిర్ణయం తీసుకునే అధికారం తహశీల్దార్‌కు ఉంటుందని ఆర్డీవో లింగ్యానాయక్ వివరణ ఇచ్చారు.