క్రైమ్/లీగల్

మెట్రో రైల్ ఉద్యోగాల పేరిట భారీ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఎల్ అండ్ టి మెట్రో రైల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకుల నుంచి డబ్బు దండుకుని మోసం చేసిన నలుగురిని టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని, రూ.14.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనిత, విజితా రెడ్డి స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలిప్పిస్తామని అమాయకులకు నచ్చజెప్పి డబ్బు వసూలు చేయాలని పథకం రచించారు. మెట్రో రైల్వేలో టిక్కెట్ల జారీ, ట్రాక్ ఇంజినీర్, ఇంటిగ్రేటెడ్ అసిస్టెంట్ మేనేజర్, అసోసియేట్ మేనేజర్, వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. తమకు మెట్రో రైల్వే అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో పరిచయమైన రవిచంద్ర, అమ్రుతల ద్వారా ఉద్యోగాలను ఆశించే వారిని వెతికి తీసుకువచ్చే పని అప్పగించారు. ఇందుకు కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు తీసుకుంటామని అభ్యర్థులకు చెప్పారు. ఈ రకంగా చాలామంది నిరుద్యోగుల నుంచి రూ.1,27,70,000 వసూలు చేశారు. ఈ చీటింగ్‌పై ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అనంతరం దర్యాప్తులో భాగంగా అందిన సమాచారం మేరకు నిందితులను అమీర్‌పేటలో పట్టుకుని వారి నుంచి రూ.14.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొమ్మును ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.