క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు, సెప్టెంబర్ 16: వరుస పంట నష్టాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన ఓ రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో గుళికల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వేపూరికోట పంచాయతీ, పెద్దయ్యగారిపల్లెకు చెందిన రైతు టి.నారాయణరెడ్డి(58)తన బోరుబావి కింద ఒకటిన్నర ఎకరాలో గతంలో వేసిన రెండు పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లడంతో ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగదు కొదవపెట్టి రుణాలు తీసుకొని మూడోసారి పంటను సాగు చేశారు. ప్రస్తుత పంటలో పండిన టమోటాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రాత్రి 9గంటల సమయంలో తన పొలంలోనే గుళికల ముందు సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో అస్వస్థకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఓ ప్రైవేట్ వాహనంలో ములకలచెరువు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. గుళికల మందు తాగినట్లు అక్కడి వైద్యులు నిర్థారించి మదనపల్లె ఏరియా అసుపత్రికి తరలించారు. మదనపల్లె ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందు తాగి...
గత ఏడాది పంట సాగు కోసం భార్య లక్ష్మిదేవి పేరుమీద ములకలచెరువు ప్రైవేట్ బ్యాంకులో బంగారులోను రూ.40వేలు, క్రాప్‌లోను రూ.95వేలు తీసుకున్నారు. నారాయణరెడ్డి పేరుమీద ప్రైవేట్ బ్యాంకులో రూ.45బంగారు, ములకలచెరువు ఇండియన్ బ్యాంక్‌లో క్రాప్‌లోను రూ.60వేలు బంగారు లోను రూ.75వేలు తీసుకున్నాడు. ట్రాక్టర్‌పైన మదనపల్లె శ్రీరామ్‌చీట్స్‌లో రూ.2.40లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. అప్పులన్ని తనకు మంచిన భారం కావడంతో గుళికల మందు సేవించాడు. కుమార్తె మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఈశ్వరయ్య పేర్కొన్నారు.