క్రైమ్/లీగల్

తుపాకి పేలి కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం, సెప్టెంబర్ 16: తుపాకీని శుభ్రం చేస్తుండగా చేయిజారి కింద పడడంతో అది పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం పోలీసుస్టేషనులో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కూనవరం ఎస్సై అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గొర్ల శ్రీనివాసరావు ఆదివారం ఉదయం తుపాకీని శుభ్రం చేస్తుండగా అది పొరపాటున కింద పడి పేలింది. దీంతో బులెట్ శ్రీనివాసరావు ఛాతిభాగం నుండి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కూనవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై అజయ్‌బాబు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

చిత్రం..గాయపడ్డా హెడ్ కానిస్టేబుల్‌ గొర్ల శ్రీనివాసరావు