క్రైమ్/లీగల్

విద్యార్థిని శిరీష ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, సెప్టెంబర్ 16: 10వ తరగతి విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ సంఘటన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ చందనాదీప్తి నివాసంగా ఉంటున్న మాచవరంలో చోటు చేసకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న శిరీష తల్లిదండ్రులు దుర్గయ్య ఎల్లమ్మ మేడ్చల్‌కు వలస వెళ్లారు. ఇంట్లో ఇద్దరు తమ్ముళ్లు, అక్క శిరీష ఉంటున్నారు. ఈమె మాచవరం ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుకుంటుంది. ఉదయం 11 గంటల సమయంలో శిరీష ఫొన్‌లో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తరువాత ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు రాబట్టడానికి మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై లింబాద్రి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరిలో ఉన్న శవాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి చూసి వారి కుటుంభాన్ని పరమార్శించారు. ఆయనతో పాటు మాచవరం గ్రామానికి చెందిన సిద్దార్థ్ విద్యా సంస్థలు అధినేత శ్రీనివాస్‌చౌదరి ఉన్నారు. రాత్రి 7 గంటల వరకు పోస్టుమార్టం ఎందుకు చేయలేదని అక్కడ డ్యూటిలో ఉన్న డాక్టర్‌ను ప్రశ్నించారు. వెంటనే పోస్టుమార్టం జరిపించి ఆ శవాన్ని బంధువులకు అప్పగించాలని శశిధర్‌రెడ్డి కోరారు. విద్యార్థిని శిరీష మరణం పట్ల మాచవరం హైస్కూల్ బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. శిరీష క్రమశిక్షణ గల విద్యార్థిని అని శ్రీనివాస్‌చౌదరి పేర్కొన్నారు. విద్యార్థి మరణం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు