క్రైమ్/లీగల్

చికిత్స పొందుతూ వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, సెప్టెంబర్ 17: కొద్దిరోజుల క్రితం విషం తాగి ఆత్మహత్య చేసుకు న్న వివాహిత రేణుక చికిత్స పొందు తూ ఆదివారం మృతి చెందింది. అయి తే ఆమె మృతికి భర్త, అత్తారింటి వేధింపులే కారణమంటూ గ్రామస్థులు, బంధువులు సోమవారం అందుకు కారణమయిన రాజు ఇంటిపై దాడికి దిగారు. గ్రామంలో ఉద్ధృక్త వాతావర ణం నెలకొనడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రజలను పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్న క్రమంలో చేర్యాల సీఐ రఘుకు, టీవీ రిపోర్టర్ చంద్రారెడ్డికి, పలువురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం... చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన రాజు అదే గ్రామానికి చెందిన రేణుకతో కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగిం ది. అంతకుముందు రాజుకు రెండు వివాహాలు కాగా మొదటి భార్య ఆత్మహత్య చేసుకోగా రెండవ భార్యతో విడాకులయ్యాయి. ఈ క్రమంలో రేణుకను మూడో వివాహం చేసుకున్నాడు. ప్రతినిత్యం భర్త కొట్టడం, హింసిస్తుండడంతో మనస్థాపానికి గురై విషం తాగి ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిం ది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో రాజు ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే చేర్యాల సీఐ రఘు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకు నే ప్రయత్నం చేయగా వారు రాళ్ళతో దాడికి దిగారు. ఈ దాడిలో సీఐ రఘు కు గాయాలయ్యాయి. వెంటనే సిద్దిపే ట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ గ్రామానికి చేరుకొని గ్రామ ప్రజలు, బంధువులకు నచ్చజెప్పి శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఆమె మృతికి కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటానని, అందుకు తగిన శిక్ష పడే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం తో వారు శాంతించారు. ఈ సంఘటనతో సిద్దిపేట జిల్లా పోలీసులు మొత్తం ఆకునూరు గ్రామాన్ని చుట్టుముట్టింది. బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.