క్రైమ్/లీగల్

రూ. 4లక్షల నగదు, 20 కాసుల బంగారం అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, సెప్టెంబర్ 17: కరప మండలం, వేళంగి గ్రామంలో సోమవారం ఆర్ధరాత్రి ఒక ఇంట్లోకి దొంగలు చొరబడి మహిళలను బెదిరించి భారీ మెత్తంలో నగదు, బంగారం అపహరించకుపోయారు. కరప పోలీసులు తెలిపిన వివరాల మేరకు వేళంగి శివాలయం వీధిలో ప్రత్తిపాటి రుక్మిణితో పాటు ఆమె సోదరి చుండ్రు లక్ష్మీకాంతమ్మ నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం తెల్లవారుఝామున ఇరువురూ నిద్రపోయిన తర్వాత ఆర్ధరాత్రి నలుగురు వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు వేసుకుని లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల కంటబడకుండా వాటిని తొలగించి లోపలికి చేరుకుని బీరువా తెరిచే ప్రయత్నం చేసారు. అయితే అలికిడికి రుక్మిణి, లక్ష్మికాంతమ్మ నిద్రలేచి ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో దొంగలు వారిని బెదిరించి బీరువా తాళాలు లాక్కుని అందులో ఉన్న నగదు, బంగారం దొంగిలించి అక్కడనుండి జారుకున్నారు. ఉదయం రుక్మిణి కరప పోలీసులకు చోరీ విషయాన్ని తెలపడంతో ఎస్సై అప్పలరాజు కాకినాడ డీఎస్పీ వర్మ, క్రైమ్ డీఎస్పీ సి పళ్లంరాజు, రూరల్ సీఐ రాంబాబుకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిని వేళంగి చేరుకుని చోరీ జరిగిని ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే కాకినాడ నుండి వచ్చిన క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్ బృందాలు రంగంలోకి దిగి ఇంట్లో అణువణువును పరిశీలించి ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. దొంగలు చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి నేరుగా బీరువా ఉన్న గదిలోకి వెళ్లడంతో పాటు ఇంట్లో సిసి కెమేరాలు ఉన్నట్లు గుర్తించడం వెనుక దొంగతానానికి ముందు రెక్కీ నిర్వహించడంతో పాటు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఈ చోరీకి పాల్పడవచ్చుననే అనుమానాల రేకెత్తుతున్నాయి. కరప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారంచి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ రవివర్మ తెలిపారు. తిమ్మాపురం, గొల్లపాలెం, పెదపూడి ఎస్సైలు బి తిరుపతి, బి సురేష్, షేక్ జబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.