క్రైమ్/లీగల్

బ్యాక్టీరియన్ ఇన్‌ఫెక్షన్‌తో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 17: మర్రివాడ పంచాయతీ పిడతమామిడి గ్రామంలో నాలుగేళ్ళ బాలుడు బ్యాక్టీరియా ఇన్‌పెక్షన్‌తో బాధపడుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. అనారోగ్యంతో బాదపడుతున్న సుర్ల దీపక్(4) ఈనెల 11న పీహెచ్‌సీలో వైద్య సేవలు పొందాడు. మెరుగైన వైద్య సేవలకై నర్సీపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. నర్సీపట్నం అనంతరం విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునికి వైద్యం చేయించారు. అక్కడి నుండి విశాఖ కేజీహెచ్‌కు తరలించగా బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, కష్టమని చెప్పడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చేసారు. బాలుడి కుటుంబ సభ్యులు ఎంపీపీ సత్యనారాయణ డెంగ్యూ లక్షణాలతోనే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. బాలుడి మృతి విషయమై స్థానిక వైద్యాధికారులు జీవన్ సంతోష్ , ప్రసన్నలను సంప్రదించగా బాలుడికి డెంగ్యూ లక్షణాలు లేవని తెలిపారు.

70 కిలోల గంజాయి పట్టివేత * ఇద్దరు అరెస్ట్

నర్సీపట్నం, సెప్టెంబర్ 17: ఏజన్సీ నుండి మైదాన ప్రాంతానికి కారులో తరలిస్తున్న 70 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎక్సైజ్ సీ ఐ డీవీ జీ రాజు అందిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి పట్టణ పొలిమేర్లలోని నెల్లిమెట్ట జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న కారు ఆపి పరిశీలించగా గంజాయిని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కారులో ఉన్న చింతపల్లి మండలం కుడుమసారె గ్రామానికి చెందని పాంగి చిట్టిబాబు(37), పాంగి గిరిబాబు(34)లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసామన్నారు. స్థానిక మున్సిబ్ కోర్టులో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి రెండు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని అంచనా. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ డీవీజీ రాజు తెలిపారు.