క్రైమ్/లీగల్

ఎన్‌జీటీ తీర్పుపై సుప్రీం స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు వాహనాలు నడిపే విషయంలో బేసి-సరి వాహన రోటేషన్ పథకం (ఆడ్ ఈవన్ వెహికిల్ రోటేషన్ స్కీం) నుంచి మినహాయించాలంటూ సుప్రీం ఆదేశించింది. అలాగే ద్విచక్ర వాహనాలకు సైతం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గత యేడాది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది. ఆడ్ ఈవెవన్ వెహికల్ రొటేషన్ స్కీం ప్రస్తుతం ఢిల్లీలో అమలులో లేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు 68 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నందున ఆడ్ ఈవన్ వెహికల్ రోటేషన్ స్కీం ద్విచక్ర వాహనాలకు సైతం అమలు చేస్తే అన్ని వాహనాలనూ నగర రోడ్లపై తిరగనిచ్చేందుకు వీలుకాదని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ గత యేడాది నవంబర్‌లో ఈ వాదనను విని ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదంటూ డిసెంబర్ 15న తీర్పునిచ్చింది. ద్విచక్ర వాహనాలకు ఈ పథకం నుంచి మినహాయింపునివ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వ రెవ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రేడెడ్ రెస్పాన్స్ ఆక్షన్ ప్లాన్ (జీఆర్‌డీ) ప్రకారం ఢిల్లీలోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ రాత్రి 10 నంచి 2 గంటల వరకు ప్రయాణిస్తూ 48 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటరుకు ఐదు వందల నుంచి 300 క్యూబిక్ మీటర్లు వరకు కాలుష్యం వెదజల్లే వాహనాలకు పథకం నిబంధన వర్తిస్తుంది. కాగా ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని నియంత్రించాలంటే పథకం నుంచి ఎవ్వరికీ మినహాయింపునివ్వరాదని హరిత ట్రిబ్యునల్ పేర్కొంది. దీనిపై జస్టిస్ మదన్ బి లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖానిస్తూ ఈ పథకం నుంచి కేవలం ద్విచక్ర వాహనాలనే కాదు మహిళలకు సైతం మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎఎన్‌ఎస్ నద్కమిని ఆదేశించింది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు ఈ మినహాయింపును ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ పథకం ఢిల్లీలో అమలులో లేదని అధికారులు విన్నవించగా వచ్చే శీతాకాలంలోపు పథకాన్ని తిరిగి అమలులోకి తేవాలని ధర్మాసనం సూచించింది. ఆడ్ ఈవెన్ స్కీం అమలైతే మరో 25 లక్షల మందికి ఢిల్లీ రోడ్లపై ప్రయాణించే వీలు కలుగుతుందని ఎఎస్‌జీ తెలిపారు.