క్రైమ్/లీగల్

శ్రీకన్య థియేటర్స్ కాంప్లెక్స్ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, సెప్టెంబర్ 17: శ్రీకన్య థియేటర్ కాంప్లెక్స్‌లోగల రెండు సినిమా థియేటర్లు సోమవారం ఉదయం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాద సంఘటన ఉదయం 6గంటలకు జరగడం వలన పెనుప్రమాదం తప్పింది. థియేటర్లలో సినిమా ప్రదర్శించే సమయంలో ఇటువంటి ప్రమాదం జరిగితే భారీగాప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురు అంటున్నారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌యే కారణంగా యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అగ్నిప్రమాదం మాత్రం విశాఖపట్నం చరిత్రలోనే పెద్దది. ఈ ప్రమాదం కారణంగా శ్రీకన్య కాంప్లెక్స్ యాజమాన్యానికి ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని యాజమాన్యం ప్రతినిధి తెలిపారు. ఎనిమిది అగ్నిమాపక శకటాలు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. థియేటర్స్‌కు ఫైర్ సేప్టీ ఉన్నప్పటికీ పని చేయలేదని చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని నగర టీసీపీ ఫకీరప్ప, జిల్లా ఫైర్ అధికారులు సందర్శించారు. అగ్ని ప్రమాదంలో శ్రీకన్య స్క్రీన్-2, శ్రీకన్నహెవెన్ స్క్రీన్-3లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కన్య స్క్రీన్-1 స్వల్పంగా నష్టం వాటిల్లింది.

చిత్రం..శ్రీకన్య థియేటర్స్ పైకప్పు నుండి ఎగసిపడుతున్న మంటలు