క్రైమ్/లీగల్

అక్టోబర్ 10న రాఫెల్‌పై పిల్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను అక్టోబర్ 10 విచారించనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, నవీన్ సిన్హా, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. కేసులో మరిన్ని పత్రాలు అందజేయాల్సి ఉన్నందున వాయిదా వేయాలని పిటిషన్ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ కోర్టును కోరారు.‘ఆరోగ్యం బాగాలేదని బెంచ్‌కు లేఖ రాస్తారు. మళ్లీ మీరే వాయిదా కోరతారు. మరోపక్క అదనపుడాక్యుమెంట్లు అంటారు’అని బెంచ్ వ్యాఖ్యానించింది. మొత్తానికి కేసు విచారణ అక్టోబర్ 10కి వేస్తున్నట్టు న్యాయమూర్తులు వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి చెల్లింపులకు చాలా వ్యత్యాసం ఉందని పిటిషనర్ ఆరోపించారు. అవినీతి చోటుచేసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 36 విమానాల కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేయాలని న్యాయవాది శర్మ కోరారు. ఈ కేసులో ప్రధాని నరేంద్రమోదీని విచారించాలని పిటిషనర్ అభ్యర్థించారు. అలాగే మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఫ్రెంచ్ ఆయుధ కంపెనీ దస్సాల్ట్‌పై శర్మ పోలీసు కేసు పెట్టారు. కాగా రాఫెల్ ఒప్పందపై మార్చిలోనే పిటిషన్ దాఖలైంది. ఒప్పందంలో ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ నేత తెహ్‌సీన్ ఎస్ పునావాలా ఆ పిటిషన్ వేశారు.