క్రైమ్/లీగల్

కేజ్రీవాల్, సిసోడియాకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై దాడి చేశారని నమోదైన కేసులో ఢిల్లీకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, 11మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 25న వారందరూ వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై ఫిబ్రవరి 19న రాత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో దాడి చేశారని ఆరోపణ. ఆ రోజు జరిగిన సమావేశం సందర్భంగా సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, ఇతర ఆప్ ఎమ్మెల్యేలు తనను దుర్భాషలాడారని, తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దౌర్జన్యం చేశారని చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు మే 18న కేజ్రీవాల్‌ను మూడు గంటలకు పైగా ప్రశ్నించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాష్ జన్వల్‌లను అరెస్టు చేసింది. అనంతరం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి 1300 పేజీల చార్జిషీటును ఆగస్టు13న దాఖలు చేశారు. ఈ కేసులో చార్జిషీటులో పొందుపర్చిన వివరాలు మీడియాతో పంచుకోకుండా ఆపాలని ఆగస్టు 25న కేజ్రీవాల్ తదితరులు వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాగా, చార్జిషీటులో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోదీ అసహనానికి ఈ చార్జిషీటు ప్రతిబింబంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలు అమానుల్లాఖాన్, ప్రకాష్ జర్వల్, నితిన్ త్యాగి, రితురాజ్ గోవింద్, సంజీవ్ జా, అజయ్‌దత్, రాజేష్ రిషి, రాజేష్ గుప్తా, మదన్ లాల్, ప్రవీణ్‌కుమార్, దినేష్ మోహనియా ఉన్నారు.