క్రైమ్/లీగల్

దేశవ్యాప్తంగా పరిష్కారానికి నోచుకోని కేసులు 22 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ వ్యాప్తంగా జిల్లా స్థాయిలోని సబార్డినేట్ కోర్టుల్లో దశాబ్ధ కాలంగా సుమారు 22లక్షల కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. సుధీర్ఘ కాలంగా మొత్తం 2.50 కేసులు కింది స్థాయి కోర్టుల్లో పెండింగ్‌లో ఉండంగా దశాబ్ధ కాలంగా పెండింగ్‌లోవున్న పెండింగ్ కేసులు 8.29 శాతమని తాజాగా జాతీయ జుడిషియల్ డేటాగ్రిడ్ విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. పదేళ్ల కాలంగా కింది స్థాయి కోర్టుల్లో మొత్తం 22,90,364 కేసులు పెండింగ్‌లో వుండంగా ఇందులో 16.92 లక్షల కేసులు క్రిమినల్ కేసులు, 5,97,595 కేసులు సివిల్ కేసులు. సాధారణంగా సివిల్ కేసులు ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించినవే అధికంగా ఉంటాయి. సాంఘానికి కీడుచేసే నేరాలకు సంబంధించినవే అధికంగా క్రిమినల్ కేసులుగా ఉంటాయి. కాగా జాతీయ జుడిషియల్ డేటాగ్రిడ్ (ఎన్‌జేడీజీ) అనేది ‘ఈకోర్టు ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టు’లో భాగంగా ఉంటుంది. ఈ విభాగం పెండింగ్‌లో ఉన్న కేసుల తగ్గించేందుకు ఓ మానిటరింగ్ టూల్‌గా పనిచేస్తుంది. సుప్రీం కోర్టు ఈ-కమిటీ జాతీయ స్థాయిలో ఒక జ్యుడిషియల్ డేటాగ్రిడ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రిడ్ ద్వారా దేశ వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో కోర్టుల్లో పెండింగ్‌లో వున్న కేసుల వివరాలను పొందుపరిచి అవసరమైనపుడు సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. దీన్నిబట్టి సంవత్సరాల తరబడి ఈ కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలను విచారణ సమయాల్లో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. సుమారు పదేళ్లు పెండింగ్‌లోవున్న కేసులన్నింటినీ త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఎన్‌జేడీజీ 24 హైకోర్టులను, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కోరుతోంది. ఈ కేసులను వ్యక్తిగతంగా కూడా పరిశీలించాల్సిందిగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ హైకోర్టులను కోరుతోంది. ఈ క్రమంలో న్యాయమూర్తులను అదనంగా నియమించేందుకు, అదనంగా ధర్మాసనాలను ఏర్పాటు చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది.