క్రైమ్/లీగల్

బాలిక కిడ్నాప్, అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్18: మైనర్ బాలికను నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి ఆపై కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలంలో వెలుగుచూసింది. దీనిపై బాలికను ఇంటివద్ద వదిలి వళ్లిన యువకుడు, అతనికి సహకరించిన నలుగురిపై కోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కోట ఎస్సై నారాయణరెడ్డి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట మండలంలోని తినె్నలపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన బైనా హేమంత్ అనే యువకుడు బాలికను గత సంవత్సరం నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతున్నాడు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 9న బాలికను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసి బాలికను ఇంటి వద్ద వదిలివేశాడు. ఈ విషయంపై బాధితురాలు తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్ద చెప్పగా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి యువకుని కుటుంబంతో రాయబారాలు జరిపారు.
అయినప్పటికీ బాధితురాలికి న్యాయం జరగకపోవడంతో బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో హేమంత్ అతనికి సహకరించిన నలుగురు యువకులపై కిడ్నాప్, త్యాచారం కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.