క్రైమ్/లీగల్

ధర్నా చౌక్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఇందిరా ఫార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మాచౌక్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత ఏడాదిగా ధర్నాచౌక్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని హైకోర్టు మంగళవారం తప్పుపట్టింది. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ధర్నాచౌక్‌ను
పునరుద్ధరించాలని బెంచ్ ఆదేశించింది. భావప్రకటనా స్వేచ్ఛను నియంత్రించవచ్చు, కానీ పూర్తిగా అణచివేయకూడదని
న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తంచేసే హక్కు పౌరులకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఎక్కడో ఊరు అవతల శివార్లలో ధర్నా చేసుకుంటే ఎవరు వింటారని కోర్టు ప్రశ్నించింది. మనుషులు నివసించని ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్లు నిర్మిస్తారా? అంటూ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావును బెంచ్ ప్రశ్నించింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల కోసమే ధర్నాచౌక్ ఎత్తివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోరగా కోర్టు మూడువారాల గడువు ఇచ్చింది. ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వరరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.