క్రైమ్/లీగల్

మాటు వేసి మట్టుబెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులను నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ పంపించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఈ హత్య కేసులో పాలుపంచుకున్న నిందితులు తిరునగరి మారుతీరావు, అస్గర్ అలీ, అబ్ధుల్ బారీ, అబ్ధుల్ కరీం, మారుతీరావు సోదరుడు తిరునగరి శ్రవణ్, కారు డ్రైవర్ కారు డ్రైవర్ సముద్రాల శివను మీడియా ఎదుట హాజరుపరిచారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన చంపిన బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను అక్కడ అరెస్టు చేశారని తెలిపారు. అతడిని రప్పించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ కథనం మేరకు మిర్యాలగూడకు చెందిన స్తిరాస్థి వ్యాపారి తిరునగరి మారుతీరావు తన ఇష్టానికి వ్యతిరేకంగా కుమార్తె అమృత వర్షిణిని దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ప్రణయ్‌పై పగ పెంచుకుని కిరాయి ముఠాను ఆశ్రయంచాడు. అమృత వర్షిణితో పెరుమాళ్ల ప్రణయ్‌కి తొమ్మిదో తరగతి నుంచే పరిచయం ఉంది. పరిచయం కాస్తా ఇంటర్మీడియట్‌లో ప్రేమగా మారింది. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న మారుతీరావు పలు సందర్భాలోల ప్రణయ్‌ను హెచ్చరించాడు. కుమార్తె అమృతను ఇంటి వద్దే ఉంచి ఇంటర్ పరీక్షలు రాయించాడు. తరువాత హైద్రాబాద్ బాచుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాడు. కాగా ఘట్‌కేసర్ శ్రీనిధి కళాశాలలో ఇంజనీర్ చదువుతున్న ప్రణయ్, అమృత మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. విషయం తెలిసిన మారుతీరావు అమృతను చదువు మానిపించేశాడు. ఆమె ఫోన్ ద్వారా అప్పుడప్పుడు ప్రణయ్‌తో మాట్లాడుతొ వచ్చింది. తన సెల్‌ఫోన్ నుండి ప్రణయ్‌తో అమృత మాట్లాడటాన్ని గమనించిన బాబాయ శ్రవణ్ ఆమెను కొట్టి హెచ్చరించారు. మారుతీరావు ప్రణయ్ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించాడు. అయితే ఇంటి నుండి బయడపడిన అమృత, ప్రణయ్ హైద్రాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న మారుతీరావు మిర్యాలగూడ వన్‌టౌన్‌లో కేసు పెట్టాడు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లుగా అమృత, ప్రణయ్ పోలీసుల ఎదుటే చెప్పేశారు. అలాగే వారి జోలికి వెళ్లవద్ధంటు మారుతీరావును పోలీసులు హెచ్చరించి పంపించారు. కులాంతర వివాహం ఇష్టం లేని మారుతీరావు తన కుమార్తెను తిరిగి ఇంటికి రప్పించేందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నించాడు. మాజీ ఎమ్మెలే వేముల వీరేశం ద్వారా ప్రణయ్ తల్లిదండ్రులతో మాట్లాడించిన ఫలితం లేకపోయింది. పెళ్లిపై ఆగ్రహంతో ఉన్న మారుతీరావుకు మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్, అమృత రిసెప్షన్‌తో మరింత రగిలిపోయాడు. ప్రణయ్‌పై కక్ష పెంచుకున్నాడు. తరుచూ మారుతీరావు బెదిరింపుల నేపధ్యంలో ప్రణయ్ ఇంటిచుట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు.
ఇలా ఉండగా ప్రణయ్‌ను తన మిత్రుడైన మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్ధుల్ కరీంతో ఎలాగైన చంపించాలని అమృత తండ్రి పథకం పన్నాడు. అతడితో చర్చించి గతంలో భూవివాదంలో తనకు పరిచయమైన ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్ నల్లగొండకు చెందిన అబ్దుల్ బారీని సంప్రదించాడు. ఈ విషయమై మాట్లాడేందుకు కరీంను హైద్రాబాద్ మలక్‌పేటలో ఉంటున్న అబ్దుల్ బారీ వద్దకు పంపించాడు. మూడు రోజుల్లో తాను మిత్రుడైన నల్లగొండకు చెందిన మరో ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్ అస్గర్‌అలీతో కలిసి మిర్యాలగూడకు వస్తానని చెప్పి కరీంను పంపించాడు. అనంతరం మూడు రోజులకు కారులో అస్గర్, బారీ మిర్యాలగూడకు చేరుకున్నారు. కరీం, మారుతీరావు వారితో చర్చించి కోటి రూపాయల సుపారికి ప్రణయ్ హత్య కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలై రెండో వారంలో తన డ్రైవర్ శివతో మారుతీరావు 15లక్షలను బారీకి రామోజీఫిలింసిటీ సమీపంలో అందచేశారు. ప్రణయ్ హత్యకు బారీ గతంలో తనకు రాజమండ్రి జైలులో పరిచయమైన పలు చోరీల నిందితుడు సుభాష్‌శర్మను సంప్రదించి బిహార్ నుంచి పిలిపించారు. ఆగస్టు 22న మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటి వద్ద అస్గర్, సుభాష్‌శర్మలు ప్రణయ్‌ను చంపేందుకు తొలి ప్రయత్నం చేశారు. అయితే మారుతీరావు మాత్రం ప్రణయ్ హత్య వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు ఏవీ రంగనాథ్ వెల్లడించారు. అమృత ఐదునెలల గర్భవతి అని, తరుచూ జ్యోతి ఆసుపత్రికి వెలుతుందని తండ్రే సమాచారం ఇచ్చేవాడు.
ఇదే క్రమంలో ఈనెల 13న మారుతీరావు తన భార్య ద్వారా అమృత, ప్రణయ్ ఈనెల 14న జ్యోతి ఆసుపత్రికి వెలుతున్నారని తెలుసుకున్నాడు. మారుతిరావు ఈ విషయాన్ని బారీకి తెలిపి ఎలాగైనా ప్రణయ్‌ను మట్టుబెట్టాలని సూచించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ ఆఫీస్‌లో పని ఉందంటు డ్రైవర్ శివతో కలిసి కారులో నల్లగొండ వెళ్లిపోయాడని ఎస్పీ తెలిపారు. అమృత, ప్రణయ్ జ్యోతి ఆసుపత్రికి వెళ్తున్న సమాచారాన్ని అందుకున్న అస్గర్, సుభాష్‌శర్మ అక్కడికి చేరుకున్నారు. అమృత మెడికల్ చెకప్ పూర్తి చేసుకుని ప్రణయ్‌తో బయటకు వెలుతున్న క్రమంలో అక్కడే మాటువేసిన సుభాష్‌శర్మ వెనుక నుంచి ప్రణయ్‌పై కత్తితో దాడి చేశాడు. మెడపై రెండు సార్లు నరకడంతో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కత్తిని అక్కడే పడేసిన సుభాష్‌శర్మ సమీపంలో వేచివున్న అస్గర్‌తో కలిసి హైద్రాబాద్‌కు వెళ్లిపోయాడు. బారీకి ప్రణయ్ హత్య విషయాన్ని తెలిపి మిగతా సుపారీ డబ్బులు వెంటనే ఇప్పించాలని అడిగాడని ఎస్పీ చెప్పారు. ఇదే విషయాన్ని మారుతీరావుకు తెలిపిన బారీ మిగతా డబ్బులను కరీంతో పంపించాలని చెప్పాడు.
ఈ హత్య జరిగిన రోజు నల్లగొండకు వస్తున్న క్రమంలో మాడ్గుపల్లి టోల్‌ఫ్లాజా సీసీ కెమెరాల్లో కనిపించడం, అటుగా వెళ్తున్నతున్న డిఎస్పీకి మారుతీరావు నమస్కారం చెప్పడం గమనార్హం. మారుతీరావును గాలించి పట్టుకుని విచారణ చేయడంతో హత్య కేసులో ఈ కోణాలన్నీ బయటపడ్డాయ. ప్రణయ్ హత్య కేసులో పాత నేరుస్తులైన ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్లు అస్గర్ అలీ, అబ్దుల్ బారీలు గత మూడు నెలలుగా రెక్కీ నిర్వహిస్తున్నా వారి కదలికల సమాచారాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. ఇదే విషయంపై ఎస్పీ రంగనాథ్ విచారం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో రాజకీయంగా ఎవరికి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిందితుల్లో అస్గర్ అలీపై గుజరాత్ హోంశాఖ మంత్రి హరిన్‌పాండ్య హత్య కేసుతో పాటు 14 కేసులు, బారీపై 9కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
చిత్రం.. ప్రణయ్ హత్య కేసు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్