క్రైమ్/లీగల్

కేసు విచారణకు ప్రత్యేక బృందం అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ముజఫర్‌పూర్‌లోని శరణాలయాలలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్న పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ముజఫర్‌పూర్‌లోని శరణాలయాల్లో ఉంటున్న బాలికలు, మహిళలపై చాలాకాలంగా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో ఈకేసు విచారణను సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని పట్నా హైకోర్టు ఆగస్టు 29న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పిటిషన్ దాఖలుకాగా జస్టిస్‌లు మదన్ బి.లోకుర్, దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపిస్తూ జూలై 30న సీబీఐ డైరెక్టర్ నియమించిన బృందం విచారణను సజావుగా నిర్వహిస్తోందని, ఈ సమయంలో వారిని మార్చాల్సిన అవసరం ఏమిటో తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందించింది. ఈ సమయంలో విచారణ బృందాన్ని మారిస్తే జరుగుతున్న విచారణకు తీవ్ర నష్టం కలిగే అవకాశముందని పేర్కొంటూ, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని ఆదేశించింది.