క్రైమ్/లీగల్

అర్హులనే చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అర్హులైన వారికి ఓటర్ల జాబితాలో అవకాశం కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓట్ల జాబితాలో అవకతవకల జరిగినట్టు ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గడువుకంటే ముందే ఎన్నికల నిర్వహించడంవల్ల అర్హత ఉన్న ఓటర్లకు నష్టం జరుగుతోందంటూ శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు ఈ వారంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అర్హులైన ఓటర్లను లక్షల సంఖ్యలో తొలగించారని ఆరోపిస్తూ మర్రి శశిధర్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన ప్రజలకు ఓటు హక్కు కల్పించిన తరువాతే శాసనసభకు ఎన్నికల నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. సాధారణ ఎన్నికల సమయానికి 20 లక్షల మందికిపైగా యువత ఓటు హక్కు పొందేందుకు అవకాశముందని, ముందస్తు ఎన్నికలవల్ల వారంతా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని శశాంక్‌రెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలవల్ల రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసినట్టేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వం తెలంగాణలో ఉందని పిటిషన్‌లో వెల్లడించారు. అలాగే ఆపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల సంఘంతో చర్చలు జరిపిన తరువాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారని పిటిషన్‌లో వివరించారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని, ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్ పాలన విధించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడ పిటిషన్‌లో వివరించారు. సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణలో ఎన్నికల నిర్వహించేలా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో శశంక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.