క్రైమ్/లీగల్

అక్టోబర్ 22 నుంచి వీరభద్రసింగ్ కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ , ఆయన భార్య తదితరులపై వచ్చిన అవినీతి అభియోగాల కేసులో వాదనలు వచ్చే నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఢిల్లీ కోర్టు ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులకు అభియోగపత్రాలను, డాక్యుమెంట్లను కూడా పంపినట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో వీరభద్రసింగ్ రూ.10 కోట్ల మేర ఆదాయాన్ని అక్రమంగా ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఐపీసీ 109, ఫోర్జరీ ఐపీసీ 465, అవినీతి నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేశారు. 225 మంది సాక్షులను చేర్చారు. 422 డాక్యుమెంట్లను జతపరిచారు.