క్రైమ్/లీగల్

ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), సెప్టెంబర్ 19: తాళికట్టిన భర్త, కన్నబిడ్డలా చూసుకోవలసిన అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు ఆడపిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే ఈ ఇలపై తన కూతుళ్లు ఏమైపోతారో? వారికి ఎవరు దిక్కని ఆలోచించిందేమో ? తన కన్న పేగును తానే తెంచుకుంది. కంటి పాపల్లా, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలను రైలుబండికి అర్పించింది. నిత్యం తాగి వచ్చి కొడుతున్న భర్త వేధింపులతో పాటు అత్త, మామల ఆరళ్లు కారణంగానే తమ కుమార్తె, మనవరాళ్లతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే ఎస్సై చెల్లూరు శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
పార్వతీపురం పట్టణం బెలగాంలోని బూరాడ వీధిలో నివాసముంటున్న శివ్వాపు శంకర్రావు వేధింపులు తాళలేక అతని భార్య శివ్వాపు కుమారి(26), బుధవారం ఉదయం తన ఇద్దరు కూతుళ్లు లిఖిత(6), యామిని (4)తో సహా బెలగాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. నిత్యం తాగి వచ్చి శారీరకంగా, మానసికంగా హింసిస్తుండేవాడు, శంకర్రావు వేధింపులకు అతని తల్లిదండ్రులు శివ్వాపు లక్ష్మమ్మ, సత్యం ప్రోత్సాహం తోడవ్వడంతో, శైలజ బుధవారం ఉదయం లేచి ఇద్దరు పిల్లల్ని పాఠశాలకు సిద్ధం చేసి, భోజనం పెట్టి, వారిని తీసుకుని పాఠశాలకు దిగబెట్టేందుకు బయలు దేరింది. ఆ పాఠశాల సమీపంలో ఉన్నరైల్వే పట్టాలపై పార్వతీపురం నుండి విజయనగరం వెళ్లే ట్రాక్ పై వచ్చే రైలు కింద పిల్లలతో సహా పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో శైలజ శరీరం, చిన్న పాప యామిని శరీరం ముక్కముక్కలై చూపరులకు భయాన్ని కలిగించాయి. పెద్ద పాప లిఖిత కాలు తెగిపోయి పట్టాలకు దూరంగా పడింది. ఈ సంఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త శంకర్రావు మాత్రం తనకు తన భార్యకు ఎలాంటి గొడవలు లేవంటున్నాడు.

పిల్లలతో శివ్వాపు కుమారి (ఫైల్)