క్రైమ్/లీగల్

ప్రభుత్వ విప్ చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: షెడ్యూల్డు కులాలకు చెందిన ఒక ఒక హమాలీ కార్మికుడిపై దాడిచేసి, గాయపరచినట్టు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై గురువారం రాత్రి ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు ముగ్గురు గన్‌మ్యాన్లు, మరో ఇద్దరు నేతలపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం మద్యం డిపోలో హమాలీగా పనిచేస్తున్న రాచీటి జాన్ అనే వ్యక్తిపై ఈ నెల 10వ తేదీన విప్ చింతమనేని, ముగ్గురు గన్‌మ్యాన్లు, మరో ఇద్దరు టీడీపీ నేతలు దాడిచేశారు. డిపోలో పనిచేస్తున్న శ్యాంబాబు అనే మరో కార్మికుడిని మద్యం బాటిల్స్ చోరీ ఘటనకు సంబంధించి హమాలీల నాయకుడైన జాన్ పని నుండి తొలగించారు. అతడిని పనిలోకి తీసుకోవాలని చింతమనేని చేసిన సిఫార్సును తాను ఖాతరుచేయకపోవడంతో ఈవిధంగా కులంపేరుతో దూషించి, దాడిచేసి, గాయపరిచారని జాన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే పోలీసులు కేసు నమోదుచేయలేదు. దీనితో వివిధ కార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి.
చివరకు గురువారం నుండి ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు గురువారం రాత్రి చింతమనేని తదితరులపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.