క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో విద్యాశాఖ ఏడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం స్టడీ లీవు కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుడి నుండి రూ.10వేలు లంచం తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం ప్రభాకరరావును అవినీతి నిరోధక శాఖ అధికార్లు గురువారం వలపన్ని పట్టుకున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం సుధాకర్ కథనం ప్రకారం జిల్లాలోని అడ్డతీగల మండలం కోనలోవ గ్రామం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న వంతల చిన్నారావు 2000వ సంవత్సరంలో టీటీసీ విద్యార్హతతో ఉపాధ్యాయ ఉద్యోగంలోకి చేరారు. బీఈడీ చదవడానికి స్టడీ లీవు కోసం ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులకు దరఖాస్తుచేసుకున్నారు. ఆ దరఖాస్తు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం ప్రభాకరరావు వద్ద పెండింగ్‌లో ఉంది.
దీనితో చిన్నారావు డీఈవోను కలవగా ఏడీనీ సంప్రదించాల్సిందిగా సూచించారు. అయితే రూ.10వేలు లంచం ఇస్తేనే స్టడీ లీవ్‌కు అనుమతి ఇస్తానని ఏడీ ప్రభాకరరావు డిమాండుచేశారు. దీనితో చిన్నారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనపై చిన్నారావు గురువారం మధ్యాహ్నం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెట్ డైరెక్టర్ ప్రభాకరరావును కలసి రూ.10 వేలు అందించారు. ప్రభాకరరావు నగదును తన బీరువాలో దాచారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడిచేసి బీరువాలో దాచిన రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రభాకరరావును ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు పీవీ సూర్యమోహన్‌రావు, వీ పుల్లారావు, ఎస్సై టి నరేష్ పాల్గొన్నారు.
ఏసీబీకి చిక్కిన మహానంది ఏఈఓ...
మహానంది: అర్చకుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం ఏఈఓ ధనుంజయను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు.
మహానందిలో సహాయ అర్చకునిగా కాంట్రాక్టు బేసిక్‌పై పనిచేస్తున్న సురేంద్రనాథ్ శర్మ కోర్టు నుంచి పేస్కేల్ ఆర్డర్ పొందారు. ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు దేవస్థానంలో ఏఈఓగా పనిచేస్తున్న ధనుంజయ రూ.25 వేలు లంచం అడిగాడు. దీంతో సురేంద్రనాథ్ శర్మ తన తండ్రితో కలిసి కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం ఏఈఓ ధనుంజయకు రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు.