క్రైమ్/లీగల్

ప్రేమికుడిపై అమ్మాయి బంధువుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ప్రేమికులపై దాడుల ఘటన లాంటిదే పలాసలో గురువారం చోటు చేసుకోవడంతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆందోళన నెలకొంది. కాశీబుగ్గ పోలీసుల కథనం ప్రకారం పొందర మురళీ, అదే వీధికి చెందిన రూప అనే అమ్మాయిని ప్రేమించాడు. 2017లో ఆమెను వివాహం చేసుకునేందుకు తీసుకెళ్లగా అప్పట్లో ఆమె మేజర్ కాకపోవడంతో అమ్మాయి బంధువులు ఫిర్యాదు చేయడంతో మురళీపై కేసు నమోదైంది. అనంతరం బెయిల్‌పై వచ్చిన తర్వాత రూప మేజర్ కావడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని రూప సోదరుడు లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గురువారం మురళీ పెద్ద ఉదయపురం వద్ద రోడ్డుపై స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన లక్ష్మీనారాయణ, మురళీతో గొడవ పడ్డాడు. దీనితో ఒక్కసారిగా పరస్పర దాడులు చేసుకోగా, మురళీ, అతని స్నేహితుడు రాజాం గంగారాంకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మురళీ భార్య రూప ఆసుపత్రికి వచ్చి మురళీ పరిస్థితి చూసి కన్నీటి పర్యంతరమైంది. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేవలం కక్షతోనే మురళీపై తన సోదరుడు దాడి చేశాడని, గతంలో కూడా హెచ్చరించేవాడని, ఈ క్రమంలో మురళీపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. మురళీ నుంచి తనను శాశ్వతంగా దూరం చేయాలనే తలంపుతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని విలపించింది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, సుజాతపండా, కోన కృష్ణారావు, సవర సుమన్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళీ, గంగారాం