క్రైమ్/లీగల్

రిజర్వ్‌లో పౌర హక్కుల నేతల కేసు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కోరెగావ్-్భమా హింసకు సంబంధించి అరెస్టు చేసిన పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని, వీరి అరెస్టుపై సిట్‌తో విచారణ జరపాలని చారిత్రకారులు రొమిలా తపర్, మరికొందరు వేసిన కేసు తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసుకు సంబంధించి రెండు వర్గాల తరఫున న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, హరిష్ సాల్వే, అడిషనల్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు పూర్తి కావడంతో చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్‌లు ఏఎం కన్విల్కర్, డివై చండ్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణకు సంబంధించిన కేసు డైరీని సెప్టెంబర్ 24లోగా కోర్టుకు సమర్పించాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు సైతం తమ రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను సమర్పించాలని సూచించి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు పౌరహక్కుల నేతలు వరవరరావు, అరుణ్ ఫెరారియా, వెర్నోర్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలకలను అరెస్ట్ చేసి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారి గృహాల్లో ఆగస్టు 29 నుంచి నిర్బంధంలో ఉంచారు. అయితే వీరి అరెస్టు అక్రమమని, వీరిని వెంటనే విడుదల చేయాలని దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరుతూ తపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొఫెసర్ సతీష్ దేశ్‌పాండే, మానవహక్కుల న్యాయవాది మజాదారువాలా సుప్రీంను ఆశ్రయించారు. అలాగే సీనియర్ అడ్వకేట్ ఆనంద్ గ్రోవర్, అశ్విన్‌కుమార్, ప్రశాంత్ భూషణ్ సైతం ఐదుగురు పౌరహక్కుల నేతలను అక్రమంగా అరెస్టు చేశారని, పౌరుల హక్కుల కాపాడటం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కాగా, కేసును విచారించిన సుప్రీం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.