క్రైమ్/లీగల్

మీడియాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ముజఫర్‌పూర్‌లోని వసతిగృహాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలకు సంబంధించి వార్తాసంస్థలు ఇచ్చే వార్తల ప్రచురణ, ప్రచారంపై ఎలాంటి నిషేధం ఉండదని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయరాదని, ఎలాంటి వార్తలు వేయరాదని పట్నా హైకోర్టు ఆగస్టు 23న మీడియాపై నిషేధాన్ని విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను జస్టిస్‌లు మదన్ బి లొకుర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. కాగా, అత్యాచారాలు, హింసకు సంబంధించి వార్తలను మీడియా సంచలనం చేయవద్దని కోర్టు సూచించింది. సెప్టెంబర్ 18న జరిగిన విచారణలో రెవారి గ్యాంగ్ రేప్ ఉదంతంలో అన్నీ తానై చెబుతూ చట్టాన్ని హేళన చేస్తున్న మీడియా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోరాదని సుప్రీం ప్రశ్నించింది. ఇలావుండగా, ముజఫర్‌పూర్ కేసుకు సంబంధించి కేసు విచారిస్తున్న పట్నా హైకోర్టు విచారణకు సంబంధించిన అంశాలు బయటకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయవద్దని, ఎలాంటి వార్తలు ప్రచురించవద్దని ఆగస్టు 23న మీడియాపై నిషేధాజ్ఞలు విధించింది. దీనిపై ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టులో సెప్టెంబర్ ఐదున పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణను మీడియా అడ్డుకుంటోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అసలు ఈ ఉదంతాన్ని వెలికి తీసిందే మీడియా అన్న సంగతి మరువరాదని ఆయన పేర్కొన్నారు. దీనిపై సుప్రీం స్పందించి పట్నా హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. మీడియాపై ఎలాంటి నిషేధం ఉండదని స్పష్టం చేసింది. కాగా, కేసు విచారణలో ఇప్పుడు ఉన్న సీబీఐ బృందాన్ని మార్చాలని పట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం సుప్రీం ఇదివరకే కొట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విచారణ బృందాన్ని మార్చాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది.