క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న 70 గోవులు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, సెప్టెంబర్ 21: కంటెయినర్‌లో అక్రమంగా తరలిస్తున్న 70 గోవులను మండలంలోని గౌరీపట్నం గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ పి వాసు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలావున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుండి 70 ఆవులను కంటెయినర్‌లో మూడు భాగాల్లో ఉంచి రవాణా చేస్తున్నారు. గోవులను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోని గౌరీపట్నం గ్రామం వద్ద కంటెనయినర్ మర్మమతులకు గురై నిలిచిపోయింది. డ్రైవరు సామాన్లు తీసుకురావడానికి వెళ్లగా నిలిచిపోయిన కంటెయినర్‌లో ఒక ఆవు చనిపోయింది. ఆవు కళేబరం నుండి రక్తం కారుతుండటంతో గౌరీపట్నం గ్రామానికి చెందిన కొయ్యలమూడి తాతారావు, కొటారు రమేష్, యలమాటి త్రినాథ్ తదితరులు గుర్తించి దుద్దుకూరుకు చెందిన టీడీపీ యువనేత ముళ్లపూడి దొరాజీ చౌదరికి తెలియజేశారు. చౌదరి ఈ విషయాన్ని ఎస్‌ఐకి తెలియజేయగా ఆయన కంటెయినర్ నిలిచిపోయిన ప్రదేశానికి సిబ్బందితో చేరుకుని, ఆవులను మరో రెండు వాహనాల్లో దేవరపల్లి తరలించారు. దేవరపల్లిలోని శ్మశాన వాటికలో వాటిని ఉంచారు. 70 ఆవుల్లో మూడు ఆవులు మృతి చెందాయి. మిగిలిన 67 ఆవులకు దేవరపల్లి ఇన్‌ఛార్జి పశువైద్యుడు ఆదిత్య వైద్య సేవలందించారు. ఎస్‌ఐ వాసు ఆవులకు కావల్సిన గడ్డి, నీటి సౌకర్యాన్ని కల్పించారు. తెలుగుదేశం సీనియర్ నేత సుంకర దుర్గారావు ఆవులకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఆవులను కంటెయినర్ నుండి దించిన తాతారావు, రమేష్, త్రినాథ్‌లను గ్రామస్థులు అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆవుల సంరక్షణ చర్యలు తీసుకుంటానని ఎస్‌ఐ తెలిపారు.