క్రైమ్/లీగల్

చెట్టుకు ఢీకొన్న గ్రానైట్ టారస్ లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 21: మహబూబాబాద్ నుండి ఖమ్మం వైపు గ్రానైట్ లోడ్‌తో వస్తున్న ఓ టారస్ లారీ మండలంలోని సత్యనారాయణపురం సమీపంలో అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో కేబిన్‌లో ఇరుక్కొన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన మాణిక్యదాసు (30) స్థానిక వరంగల్ క్రాస్‌రోడ్‌లో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. విధుల్లో భాగంగా దాసు మహబూబాబాద్ నుండి టారస్ లారీపై గ్రానైట్ రాళ్ళను తీసుకొని వస్తుండగా అదుపుతప్పడంతో చెట్టుకు ఢీకొని కేబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కేబిన్‌లో ఇరుక్కుపోయిన దాసు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.

విద్యుత్ బాధిత కుటుంబానికి 10లక్షల ఆర్థికసాయం
* చెక్కును అందజేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 21: విద్యుత్ ప్రమాదానికి గురై మృతిచెందిన తండ్రి కొడుకుల కుటుంబానికి ప్రభుత్వం నుండి మంజూరైన 10లక్షల చెక్కును తాజా మాజి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ బాధిత కుటుంబానికి శుక్రవారం అందజేశారు. ఘునాథపాలెం గ్రామానికి చెందిన రైతు బతావత్ శంకర్, తనయుడు వెంకటేష్‌లు జూన్ 4వ తేదిన విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందడంతో ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని నాడు హామి ఇచ్చారు. ఈ మేరకు మంజూరు ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రెంటాల ప్రసాద్, నాయకులు భద్రయ్య, రామారావు, వెంకటనర్సయ్య, తిరుపతిరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.