క్రైమ్/లీగల్

హత్యకేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైమ్,సెప్టెంబర్ 21: ఈనెల 18వ తేదీన కడప నగరం తిలక్‌నగర్‌లో పవన్‌కుమార్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడని డీఎస్పీ మాసూంబాషా తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాటిమర్రి పవన్‌కుమార్ అలియస్ కుమార్ (29) హత్యకేసును పురోగతి సాధించి అతన్ని హత్యచేసిన హసనాపురం రాము, పాలెం భాస్కర్, తన్నీరు హరిప్రసాద్‌లు కుమార్‌ను పథకం ప్రకారమే చంపాలని హత్యచేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరివద్ద రూ.30వేలు పూచీగా అప్పు ఇప్పించిన పవన్‌కుమార్ తిరిగి చెల్లించకపోవడంతో తరచుగా వీరు డబ్బు చెల్లించాలని అడుగుతూ వచ్చారని డీఎస్పీ తెలిపారు. హతుడిని తిలక్‌నగర్‌లోని గాంధీరోడ్డు టి.జంక్షన్ వద్దకు పిలిపించుకుని ముద్దాయిలు తమ వద్ద వున్న చురకత్తితో విచక్షణా రహితంగా పొడిచి గాయపరిచారన్నారు. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కుమార్‌ను చికిత్సనిమిత్తం రిమ్స్‌కు తరలించే క్రమంలోనే చనిపోయాడని డీఎస్పీ పేర్కొన్నారు. హతుడి భార్య బేబీ ఫిర్యాదుమేరకు రిమ్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. హతుడు ఎస్సీ కులానికి చెందిన వాడని అందువల్లే ముద్దాయిలు ఇతర కులానికి చెందినవారైనందున ఎస్పీ ఆదేశాలమేరకు చలమారెడ్డి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముద్దాయిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇందులో ఏ-1 ముద్దాయిగా హసనాపురం రాము ఇంటివద్ద ముద్దాయిలు వారు నేరంలో ఉపయోగించిన చురకత్తి, వారు ధరించిన రక్తపుమరకల దుస్తులు, రెండుమోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిలను రిమాండ్‌కు తరలించామన్నారు. హత్యను చేధించిన రిమ్స్ సిఐ పురుషోత్తమ్‌రాజు, ఎస్‌ఐ కుళాయప్ప, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు, కానిస్టేబుల్ మనోహర్‌లను డిఎస్పీ అభినందించారు