క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, సెప్టెంబర్ 21: పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన రాజేశ్వరి (26) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మా బిడ్డను అత్తింటి వారే వేధించడంతో మరణించిందని, బాత్‌రూమ్‌లో జారి పడి మృతి చెందిందని అత్తమామలు చిత్రీకరించారని మృతురాలి తల్లి శాంతమ్మ, అక్క శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే...రామ్‌నగర్‌కు చెందిన వెంకటాచలపతి, శాంతమ్మల నాలుగవ కుమార్తె రాజేశ్వరిని శాంతినగర్‌కు చెందిన కుంటిమళ్ల లక్ష్మినారాయణ కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం మృతురాలు 4 నెలల గర్భిణి. వివాహం జరిగిన మూడు నెలలు సజావుగా కాపురం సాగిన అనంతరం అత్తింటి వారు వేధింపులు మొదలయ్యాయని బంధువుల ఆరోపణ. ఈ తరుణంలో బాత్‌రూమ్‌లో పడి మృతి చెందిందని భర్త నరేష్ ఫోన్ చేయడంతో మృతురాలి తల్లిదండ్రులతోపాటు బంధువులు వచ్చి ఆమె వీపు, గొంతుపై వాతలు ఉన్నాయని తమకు తమ కుమార్తెను హత్య చేసి నాటకాలు ఆడుతున్నారని బోరున విలపించారు. ఈమేరకు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతురాలి భర్త నరేష్‌తోపాటు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
* మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే....
మృతురాలు రాజేశ్వరి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ శుక్రవారం పరామర్శించారు. వారి అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు ఆర్థికసాయమందించారు. అనంతరం పారదర్శకంగా విచారణ చేపట్టి మృతురాలి కుటుంబీకులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
మడకశిర, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని టీడీపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాసన్న (60) మృతి చెందాడు. అమిదాలగొంది పంచాయతీ టీడీపల్లికి చెందిన దాసన్న గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో మడకశిరకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పావగడ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తున్న ఢీకొనడంతో దాసన్న కిందకు పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలు
హిందూపురం టౌన్, సెప్టెంబర్ 21: హిందూపురం మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. హిందూపురం నుండి ప్రయాణీకులను ఎక్కించుకొని సంతేబిదనూరు వెళుతున్న ఆటో అదుపు తప్పి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న అంజినప్ప, రామక్క, చిన్నారులు బిందుశ్రీ, మదిహాలు తీవ్ర గాయాలకు గురయ్యారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అంజినప్ప కాలికి తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఇతర ప్రాంతాలకు సిఫార్సు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిగత గొడవల్లో వ్యక్తికి కత్తిపోట్లు
పెద్దవడుగూరు, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని చిన్నవడుగూరు గ్రామంలో శుక్రవారం ఉదయం రామాంజినేయులు అనే వ్యక్తి మునయ్యపై కత్తితో దాడి చేశాడు. రామాంజినేయులుపై మునయ్య బండరాయితో దాడి చేయడంతో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు ఇరువురిని పెద్దవడుగూరు వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించి మునయ్యను అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రామాంజినేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువురు అపస్మారక స్థితిలో ఉండడంతో ఇరువురు కోలుకున్న తర్వాత వారి వివరాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.