క్రైమ్/లీగల్

చోరీ కేసులో ఒకరికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి ఫిబ్రవరి 27: అమాయకుడైన ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి బంగారు పుస్తెలతాడు, రూ.3వేల నగదును దొంగిలించిన వ్యక్తిని పట్టుకొని శంకర్‌పల్లి పోలీసులు మంగళవారం రిమాండుకు తరలించారు. శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తొర్‌మామిడి గ్రామానికి చెందిన బేగరి గోపాల్ కొంతకాలంగా బ్యాంకులు, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల వద్ద కాపుకాచి అమాయకులైన వ్యక్తులను గుర్తించి మాయమాటలు చెప్పి మద్యం తాపించి వారిని బైక్‌లపై తీసుకెళ్లి దోపిడీ చేస్తున్నాడు. ఈనెల 16న శంకర్‌పల్లిలోని కార్పొరేషన్ బ్యాంక్‌లో అంతప్పగూడ గ్రామానికి చెందిన వడ్డె సత్తయ్య తన కూతురు బంగారు పుస్తెలతాడు (మూడు తులాలు)కు డబ్బు కట్టి బ్యాంక్ నుంచి తీసుకెళ్తుండగా నిందితుడు బేగరి గోపాల్.. అతనిని బ్యాంక్ వద్ద కలిసి సత్తయ్యకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ రోడ్డులోని మంజు వైన్స్‌కు తీసుకెళ్లి బాగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సత్తయ్యను బైక్‌పై తిప్పి పత్తెపూర్ గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జ్ క్రింద దించి మూడు తులాల పుస్తెలతాడును, రూ.3వేల నగదును అతని వద్దనుంచి దోచుకున్నాడు. శంకర్‌పల్లిలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా నిందితుని ఆనవాళ్ళు, బైక్ ఫొటోలతో సింగాపురంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడు గోపాల్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేసిన మోసాలను ఒప్పుకున్నాడని సిఐ తెలిపారు. గోపాల్ గతంలో కూడా తాండూరు, వికారాబాద్ ప్రాంతాలలో రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా నిందితుడి వద్ద మూడు తులాల బంగారు పుస్తెలతాడు, ఐదు ఉంగరాలు, రెండు బంగారు చెవి పోగులు, 12 బంగారు ర్యాక్‌లు, రూ.1.80లక్షల నగదు, బైక్‌ను, ఏటీఎం కార్డులను రికవరీ చేసామని సీఐ శశాంక్‌రెడ్డి వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు పంపించామని తెలిపారు.