క్రైమ్/లీగల్

రైలు ఆపేశారు.. దోచేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయం. అంతలోనే రైలు ఆగిపోయింది. బోగిల్లో అలజడి నెలకొంది. మహిళల అరుపులు కేకలతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే మహిళల మెడల్లో ఉన్న పుస్తెల తాళ్లతోపాటు ఇతర బంగారు ఆభరణాలు దోపిడి దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం
తెల్లవారుజామున 3.50 నుండి 4గంటల మధ్యలో 17604నంబర్ గల యశ్వంత్‌పూర్ రైలు దారిదోపిడికి గురైంది. యశ్వంత్‌పూర్ నుండి కాచిగూడకు వస్తున్న రైలును దారిదోపిడి దొంగలు ప్రయాణికుల నుండి ఆభరణాలను దోచుకెళ్లారు. దివిటిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గల సిగ్నల్‌ను కట్ చేసిన దొంగలు రైలు అక్కడికి రాగానే రైలు ఆగిపోయింది. వెంటనే దారిదోపిడి దొంగలు ఒక్కసారిగా బోగిలలోని కిటికిల పక్కన కూర్చున్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను ఒక్కసారిగా దోచుకెళ్లారు. రైలు అగిపోవడంతో ఏదో స్టేషన్ వచ్చిందని అనుకున్న ప్రయాణీకుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అయితే తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు చాలామంది గాఢనిద్రలో ఉన్నారు. ఇదే సమయాన్ని అసరాగా చేసుకున్న దోపిడీ దొంగల ముఠా ముందస్తు ప్రణాళికతో సిగ్నల్‌ను కట్ చేసి దోపిడి చేశారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన మహబూబ్‌నగర్ రైల్వేపోలీసులు, మహబూబ్‌నగర్ డిఎస్పీ భాస్కర్‌తో పాటు పోలీసు బలగాలు దివిటిపల్లి సమీపంలో యశ్వంత్‌పూర్ రైలు దోపిడికి గురైన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణీకుల నుండి వివరాలను సేకరించారు. ప్రయాణీకులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దోపిడీని రైల్వే పోలీసులు చాలా సిరియస్‌గా పరిగణించారు. వెంటనే మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సైలు సంజీవరావు, రాఘవేందర్‌గౌడ్‌తో పాటు మరో బృందాన్ని రంగంలో దింపారు. దారిదోపిడి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే ఇలాంటి దోపిడీలు పని మహారాష్టల్రోని పార్ధిగ్యాంగ్ పని అయ్యి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. సోలాపూర్‌లోని ఈ గ్యాంగ్‌కు సంబంధించిన మూలాలు ఉండడంతో వెంటనే మహారాష్టల్రోని సోలాపూర్‌లో పార్ధిగ్యాంగ్ కదలికలపై రైల్వే పోలీసులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
యశ్వంత్‌పూర్ రైలు దారిదోపిడీకి గురైందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిటకిటలాడింది. మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్ సైతం రైల్వేపోలీసులకు సహకారంగా తమ సిబ్బందిని కూడా దొంగలను పట్టుకోవడానికి రంగంలోకి దింపారు. జాగిలాలతో రైల్వేపట్టాలపై పరిశీలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే ఎస్సైలు సంజీవరావు, రాఘవేందర్‌గౌడ్‌లు తెలిపారు. పార్ధిగ్యాంగ్‌పైనే అనుమానాలు ఉన్నట్లు కూడా వారు వెల్లడించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తూ త్వరలోనే దారిదోపిడీ దొంగలను పట్టుకుంటామని వారు తెలిపారు.
చిత్రం.. పనిచేయకుండా దోపిడీ దొంగలు వైర్లు తొలగించిన సిగ్నల్