క్రైమ్/లీగల్

భారీ మొత్తంలో గంజాయి ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: విశాఖ జిల్లాలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలను మంగళవారం పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. జిల్లావ్యాప్తంగా 85 కేసుల్లో 11,493 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈ భారీ గంజాయి నిల్వలను విశాఖలో ధ్వంసం చేశారు. అత్యధికంగా మాడుగుల పోలీసు స్టేషన్ పరిధిలో 51 కేసులు నమోదు కాగా, అనకాపల్లి, బుచ్చెయ్యపేట పోలీసు స్టేషన్ల పరిధిలో 11 చొప్పున, చోడవరం పోలీసు స్టేషన్ పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని కోర్టు అనుమతితో ధ్వంసం చేసినట్టు విశాఖ రేంజ్ డీఐజీ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. విశాఖలో కిలో గంజాయి విలువ రూ.2000 వరకూ పలుకుతోందని, ఇదే బయట రాష్ట్రాలకు చేరితే విలువ 400 శాతం పెరుగుతుందన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2.3 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌లో కీలక నిందితులను పట్టుకునేందుకు నిఘా ఉంచామన్నారు. స్మంగ్లింగ్ రాకేట్ నడుపుతున్న వారి కదలికలను కనిపెట్టి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసులు సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 15 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామన్నారు.