క్రైమ్/లీగల్

ఆ ఇద్దరి టార్గెట్.. ఒంటరి ప్రయాణికులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, సెప్టెంబర్ 22: ఒంటరిగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడుతు న్న ఇద్దరిని శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుండి రూ.4.57లక్షల విలువచేసే 115 గ్రాముల బంగారు అభరణాలు, ఆటో, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, ఫ్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్ నిందితుల వివరాలు వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లా సుందరయ్య నగర్‌కు చెందిన ఆడెపు శ్రావణ్‌కుమార్(27), మండల క్రిష్ణంరాజు ఇద దరు నిందితులు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో స్నేహం ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాత్రి సమయాల్లో వారి ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను బెదిరించి డబ్బు సం పాదించాలనే ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆగస్టు 27వ తేదీ రాత్రి 8 గంటలకు వరంగల్ హెడ్ పోస్టాపీస్ వద్ద కరీమాబాద్‌కు వెళ్లే నగల వ్యాపా రి కేదాటి అశోక్ కుమార్‌ను ఆటోలో ఎక్కించుకుని ఉర్సుగుట్ట వైపు తీసుకెళ్లారు. ఏపీ-36, వీ8797నెంబర్‌గల ఆటోలో ఉర్సుగుట్ట వద్దకు తీసుకెళ్లి అశోక్‌కుమార్‌ను బెదిరించి, అరవకుండా నోట్లో గుడ్డపెట్టి 150 గ్రాముల బంగారు కడ్డీలు, 15 వేల నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కుని అదే ఆటోలో వెళ్లి పోయారు. బాధితుడు మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దోపిడీ చేసిన బంగారు కడ్డీలను అమ్మడానికి నిందితులు నేరానికి ఉపయోగించిన ఆటోలో ఉదయం 9.30గంటలకు వరంగల్ చౌరస్తాలోని బులియన్ మార్కెట్‌కు వచ్చారు. సమాచారాన్ని అందుకున్న క్రైం డీసీపీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ డేవిడ్‌రాజ్, పోలీసు సిబ్బందితో కలిసి బులియన్ మార్కెట్‌కు చేరుకుని నిందితులను తనిఖీ చేయడంతో బంగారాన్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా దోపిడీ చేసిన బంగారు కడ్డీలనుండి శ్రావణ్ కుమార్ అనే నిందితుడు 50 గ్రాముల అభరణాలు చేయించుకున్న ట్లు, 35 గ్రాములు అమ్మి ఒక ద్విచక్ర వాహనంతోపాటు ఫ్రిడ్జ్ కోనుగోలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తెలిపారు.