క్రైమ్/లీగల్

పెయిడ్ న్యూస్‌పై వేటు వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఎన్నికల సమయంలో మీడియాలో ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి చేసిన సేవ గురించి గొప్పలు చెబుతూ ప్రచురితమయ్యే వార్తలను పెయిడ్ న్యూస్‌గా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి నరోత్తమ్ మిశ్రాపై పెయిడ్ న్యూస్‌కు సంబంధించి వచ్చిన అభియోగాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పెయిడ్ న్యూస్ వ్యవస్థను హైకోర్టు తీర్పు నిరోధించకలేకపోయిందంటూ కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. పత్రికల్లో ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి చేసిన సేవల గురించి అనుకూలంగా వార్తలు ప్రచురితమవుతున్నాయని, ఇవి చూడడానికి వార్తల మాదిరిగానే ఉంటాయని, వాస్తవానికి ఇవన్నీ పెయిడ్ న్యూస్‌లని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇవేమీ వార్తలు కాదని, ముమ్మాటికీ పెయిడ్‌న్యూస్ అని కోర్టుకు తెలిపారు. ఎన్నికల సమయంలోనే ఈ తరహా వార్తలు పత్రికల్లో ప్రచురితమవుతుంటాయన్నారు. వార్తల ముసుగులో పెయిడ్ న్యూస్‌ను ప్రచురితం చేయించుకుని ఓటర్లను ప్రజాప్రతినిధులు ప్రలోభానికి గురి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఈ ఏడాది మే 18వ తేదీన ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టును కోరింది. వార్తలు నిష్పక్షపాతంగా ఉండాలని, ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉండరాదన్నారు. పెయిడ్ న్యూస్ ఒక అపవిత్ర బంధమని పేర్కొన్నారు. మంత్రి మిశ్రాకు సంబంధించి 42 వరకు పెయిడ్ న్యూస్‌లను సేకరించి విచారణ జరిపి ధృవీకరించామన్నారు. అందుకే మిశ్రాపై అనర్హతవేటు వేశామన్నారు.