క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 24: మండలంలోని అప్పాజిపేట గ్రామంలో అప్పుల బాధతో సోమవారం రైతు గంగుల మల్లయ్య (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ మురళీగౌడ్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగుల మల్లయ్య తనకున్న మూడున్నర ఎకరాల చెల్కలో పత్తిపంటను సాగు చేస్తుండగా వర్షాభావంతో పంట దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లయ్య అప్పుల బాధతో గతంలో ఉన్న ఆరు ఎకరాల్లో రెండున్నర ఎకరాలు అమ్ముకోవడం గమనార్హం. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ తెలిపారు.