క్రైమ్/లీగల్

‘మూక హత్యల’పై మా మార్గదర్శకాలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మూక, గోరక్షణ పేరుతో దాడుల విషయంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడే వారు చట్టప్రకారం శిక్షార్హులు అవుతారన్న విషయం మరువరాదని హెచ్చరించింది. మూక హింస, గో సంరక్షణ పేరుతో జరిగే అరాచకాలపై జూలై 17న తాము ఇఛ్చిన ఆదేశాలపై తమ స్పందనను తెలంగాణ, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాలు ఇంతవరకు తెలియజేయలేదని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా ఏఎం కన్విల్కర్, డివై చండ్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మూక హత్యలకు పాల్పడటం అంటే పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే అని పేర్కొంది. తాము దీనిపై ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి ఈ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మూడు రోజుల్లో తమ అఫిడవిట్లు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా కాంగ్రెస్ నేత తెహ్‌సేన్ పూనేవాలా వేసిన పిల్‌ను రెండు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది. ఈ రెండు సమస్యలపై టెలివిజన్, రేడియో ఇతర ప్రసార సాధనాలలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని తాము ఇచ్చిన ఆదేశంపై కేంద్రం ఏం చర్య తీసుకుందో తెలియజేయాలని కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు మూక హత్యల నివారణకు కేంద్ర మంత్రులు సమావేశమై దీనిపై ఒక చట్టం తీసుకువచ్చే యోచన చేశారని కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇలావుండగా జూలైలో సుప్రీం ఇచ్చిన తీర్పులో మూక హింసపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యవంతులను చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వాటి నివారణకు తాము చేపట్టిన చర్యల గురించి ఆయా ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచాలని ఆదేశించింది. ఈ దేశంలో మూకస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని పేర్కొంటూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది.