క్రైమ్/లీగల్

మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, సెప్టెంబర్ 25: పట్టణంలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చీరాలలో చర్చనీయాంశమైంది. విద్యార్థి సంఘాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండల పరిధిలోని ఈపూరుపాలెం గ్రామానికి చెందిన ఎన్ సురేంద్రబాబు కుమారుడు మురళీకృష్ణ శాంతి థియేటర్ రోడ్డులోని ఓ కళాశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం కళాశాలకు వెళ్లిన అతన్ని తోటి విద్యార్థులు అంధహీనంగా ఉన్నావంటూ అవహేళన చేయడంతో మనస్థాపానికి గురయ్యాడు. కళాశాల ముగిసిన తర్వాత ఇంటికెళ్లిన మురళీకృష్ణ పురుగుల మందు సేవించాడు. దాన్ని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాల్లో చేర్పించగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. దీంతో ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఒకటో పట్టణ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే అదే కళాశాల్లో ఓ అధ్యాపకుడు ఓ విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో ఆస్పత్రి పాలైన సంఘటన కొద్దినెలల క్రితమే చోటుచేసుకోవడం గమనార్హం. దానికి సంబంధించి ఆ విద్యార్థి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడడంతో విషయం బయటకు పొక్కలేదు. ఓ వైపు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తూ యాంటి ర్యాగింగ్ చట్టంపై అవగాహన కల్పిస్తుంటే మరో వైపు ప్రయివేటు విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కల్గించే అంశం.