క్రైమ్/లీగల్

హత్యకేసులో ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఫిబ్రవరి 28: మండలంలోని కూర్మరాజుపేట గ్రామంలో క్షణికావేశంలో తాగివచ్చిన కొడుకును హత్యచేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టుచేసినట్లు సీఐ సంజీవిరావు తెలిపారు. బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25న మద్యం మత్తులో ఉన్న బెల్లాన గోపాలకృష్ణపై ఆయన తల్లిదండ్రులు పోలమ్మ, సింహాచలంలు దాడి చేశారన్నారు. ఈ దాడిలో కొడుకు గోపాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. ఈమేరకు హత్యచేసిన ఆ ఇద్దరిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ గణేష్, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.