క్రైమ్/లీగల్

వ్యభిచార గృహాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 26: నగరంలో సీఐడీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించారు. కొత్తపేట, సత్యనారాయణపురం పోలీస్టేషన్ల పరిధిలో కొందరు వ్యక్తులు కొంతకాలంగా ఇళ్లు అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతులను పలువిధాల ఆకర్షించి మాయమాటలతో డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు వెల్లడైంది. ఈ దాడుల్లో ముగ్గురు వ్యభిచార గృహ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని 8 మంది యువతులకు విముక్తి కల్పించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని మధురానగర్, వీవీ నరసారావు రోడ్డులో ఓ ఇంటిపై దాడి చేసిన సీఐడీ, టాస్క్ఫోర్స్ బృందాలు బత్తుల శ్రీనివాసరావు(32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా అతను ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొత్తపేట పోలీస్టేషన్ పరిధి చేపల మార్కెట్ సమీపంలోని శిల్పారామం వీధిలో ఓ ఇంట్లో వ్యభిచారం కొనగుతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేశారు. చల్లా జ్యోతి(34) అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి ముగ్గురు యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తోంది. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసు బృందాలు సయ్యద్ యాస్మిన్(45) అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈమె భవానీపురానికి చెందిన ఓ యువతిని తీసుకొచ్చి వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ మూడుచోట్ల జరిపిన సోదాల్లో నిర్వాహకులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని మొత్తం 8మంది యువతులకు విముక్తి కలిగించారు. నిందితుల నుంచి 11 సెల్‌ఫోన్లు, ఒక మోటారు బైక్, రూ.7,400 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో సహా సత్యనారాయణపురం, కొత్తపేట పోలీస్టేషన్లలో వీటిని అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.