క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి వద్ద కొత్తచెరువు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుల్బర్గ జిల్లా జోరిగి హిదేరి గ్రామానికి చెందిన సృష్టి (6) అనే చిన్నారి మృతి చెందింది. సృష్టి రోడ్డు దాటుతున్న సమయంలో పెనుకొండ వైపు నుండి వెళుతున్న ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురైంది. వెంటనే ఆ చిన్నారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు కర్నాటక నుండి జీవనోపాధి కోసం పెనుకొండ ప్రాంతానికి వచ్చి కూలీ పనులు చేసుకొంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం మీద పడి వ్యక్తి మృతి
లేపాక్షి, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని చోళసముద్రంలో ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనం మీద నుండి పడి చిలమత్తూరు మండలానికి చెందిన రామాంజినప్ప (55) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి శెట్టిపల్లి రామాంజినప్ప చోళసముద్రం బస్టాండ్ సమీపంలో కింద పడ్డాడు. అతని ప్రక్కనే ద్విచక్ర వాహనం ఉంది. సంఘటన చూసిన స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడు శెట్టిపల్లికి చెందిన రామాంజినప్పగా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.