క్రైమ్/లీగల్

పొలం పనులు చేస్తూ రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, సెప్టెంబర్ 26: పొలం పనుల్లో పాల్గొనేందుకు వెళ్ళిన రైతు స్పృహ తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో మేడివాడ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈసంఘటనకు సంబంధించి రావికమతం ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడివాడ గ్రామానికి చెందిన సీహెచ్ అప్పలనాయుడు(40) పొలం పనుల కోసం ఉదయం వెళ్ళి పొలానికి నీరు పెడుతుండగా స్పృహ తప్పి పొలంలోకి జారిపడిపోయాడన్నారు. దీంతో అక్కకక్కడే మృతి చెందడంతో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.