క్రైమ్/లీగల్

మిఠాయి ప్యాకెట్ల పేర గల్ఫ్‌కు గంజాయి స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట, ఫిబ్రవరి 5: మిఠాయి ప్యాకెట్ల పేర గల్ఫ్‌కు ప్రయాణికుల సాయంతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లెంవారి పల్లెకు చెందిన పసుపులేటి రెడ్డికిషోర్, బొక్కే ప్రవీణ్‌కుమార్, ఎర్రగొల్ల కృష్ణయ్యను అరెస్టు చేసి వారి నుంచి 4.2 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, మోటారు బైక్ స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. పుల్లంపేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వీరు గల్ఫ్‌కు వెళ్తున్న అమాయకులకు ఎరవేసి మిఠాయి ప్యాకెట్లు తమ వారికి అందజేయాలని చెప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు.