క్రైమ్/లీగల్

బాలికపై వృద్ధుడి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలు సార్లు అత్యాచారం జరిపిన వృద్ధుడి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర పశ్చిమ మండల పోలీస్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మహ్మద్ అబ్ధుల్ వాహబ్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలు సార్లు అత్యాచారం చేశాడు.
చివరకు ఆ బాలిక గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో వాహబ్ పేరు చెప్పడంతో సమీపంలోని భరోసా కేంద్రాన్ని ఆశ్రయించారు. అక్కడ జరిగిన సంగతి చెప్పడంతో హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.