క్రైమ్/లీగల్

బైక్‌ల దొంగకు బేడీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 1: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుండి సుమారు 8లక్షల విలవగల 16 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. నిందితుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ములుగు ఘనపూర్ ప్రాంతానికి చెందిన షేక్ చాంద్ పాషాగా గుర్తించారు. నిందితుడికి ఐదు సంవత్సరాల వయస్సులో విద్యుత్ షాక్‌కు గురి కావడంతో తన ఎడమచేయిని మోచేతి వరకు తొలగించడం జరిగింది. గతంలో ములుగు ఘన్‌పూర్ ప్రాంతంలోని చుట్టు పక్కల గ్రామాల్లో అల్యూమినియం కరిగించి ఇంటి గృహోపకరణాలను తయారుచేసి అమ్మేవాడు. ఇదే సమయంలో నిందితుడు మద్యంతో పాటు జల్సాలకు అలవాటు పడటంతో తనకు వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలను చోరీ చేసేందుకు ప్రణాళికను రూపొందించుకున్నాడు. ఇందులో భాగంగానే 2006 సంవత్సరంలో తొలి సారిగా వరంగల్ నగరంలోని 16కు పైగా ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడ్డాడు. అదే సంవత్సరంలో నిందితుడుని మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సుమారు 18 నెలల జైలు జీవితం గడిపిన అనంతరం జైలు నుండి విడుదలైన కొద్ది కాలం పాటు తన వృత్తిని కోనసాగించడంతో పాటు తిరిగి జాల్సాలకు అలవాటు పడ్డాడు. నిందితుడు తాను దొంగిలించిన ద్విచక్రవాహనాలను సమయం వచ్చినప్పుడు అమ్మేందుకు తనకు తెలిసి ఒక ప్రాంతంలో భద్రపరిచేవాడు. తాను చోరీ చేసిన ద్విచక్రవాహనంపైనే తిరుగుతూ వాటిని అమ్మేందుకు నగరంలో ఏదైన ఆటోకన్సల్టెన్సీకి వెళ్లి బేరం కుదుర్చుకోనేందుకు హన్మకొండ నగరానికి వస్తున్నట్లుగా క్రైం అడిషనల్ డిసీపీ అశోక్ కుమార్, క్రైం ఏసీపీ బాబురావులకు సమాచారం రావడంతో వీరి అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ డేవిడ్ రాజు తన సిబ్బంది మరియు మాట్వాడ పోలీసులతో కలసి ములుగు రోడ్‌లోని హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అదే సమయంలో ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చిన నిందితుడుని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో విచారించి నిందితుడు తాను చోరీ చేసి రహస్య ప్రాంతంలో ఉంచిన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందతుడుని సకాలంలో గుర్తించి చోరి సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడిషన్ డిసీపీ అశోక్, ఏసీపీ బాబురావు, ఇన్స్‌స్పెక్టర్ డేవిడ్ తదితరులను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.