క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, మార్చి 1: తమ ఆస్తి తగాదాలను పరిష్కరించడం లేదని డెత్ నోట్‌లో కొంతమంది పేర్లురాసి పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సంగెం మండలం గవిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ముడిదినేని మనోహార్(50) గ్రామ శివారులో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో పంట పొలాల్లో పురుగుల మందు తాగి, మిత్రుడు సుద్దోజు శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా పురుగుల మందు సేవించినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం తెలపగ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని చూసే వరకు మనోహార్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యులు 108 ద్వారా ఎంజిఎంకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు వారు తెలిపారు.
మృతుడు రాసిన డెత్ నోట్‌లో తనకున్న వ్యవసాయ భూమి సమస్యను పరిష్కరం చేయకుండా ముడిదినేని కరుణకర్, సాంబయ్య, స్వామి, శ్రీను, లచ్చయ్య, నవీన్ రెడ్డి, సర్పంచ్ పత్తిపాక రమేష్, సమస్యను పరిష్కరం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నరని, ఇదే సమస్యను గ్రామ విఆర్‌వోకు ఎంఆర్‌వోకు తెలిపినప్పటికి వారు కూడా స్పందించలేదని నా చావుకు కారణం వీరేనని డెత్ నోట్ లో పేర్కోన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్నికి సిఐ శ్రీ్ధర్‌రావు, సంగెం ఎస్సైలు దీపక్‌లు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.