క్రైమ్/లీగల్

భారీగా నకిలీ టీపొడి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఫిబ్రవరి 6: పట్టణంలోని మాసాపేట వేంపల్లె రోడ్డు సమీపంలో గల అజ్మత్ ట్రేడర్స్‌పై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. మాసాపేటలోని వేంపల్లె మార్గంలో గల అజ్మత్ ట్రేడర్స్ దాదాపు ఆరు సంవత్సరాలుగా అస్సాం బ్రాండ్ టీ ప్యాకెట్లను అమ్ముతున్నాడని తెలిపారు. అయితే ఒరిజినల్ కంపెనీ అయిన అస్సాం స్టార్ టీ బ్రాండ్ హైదరాబాద్ నుండి వచ్చిన సరుకులలో కల్తీ చేసి సరుకును రాయచోటి నుండి వివిధ ప్రాంతాలకు విక్రయాలు అజ్మత్ ట్రేడర్స్ వారు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ సరఫరా నాణ్యతతో కూడుకోనిదని, మామూలు ధర కంటే ఇంకా కొద్దిగా తక్కువ ధరతో వీటిని విక్రయించేవారని వివరించారు. అయితే ఒరిజినల్ కంపెనీ యజమాని ఆంజనేయస్వామిచౌదరి నుండి రావాల్సిన సరుకు అజ్మత్ ట్రేడర్స్‌కు తగ్గడంతో అనుమానం వచ్చిన యజమాని నిఘా ఏర్పరచడం జరిగిందన్నారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులతో పాటు తాము రంగంలోకి దిగగా గోడౌన్‌లో దాచి ఉంచిన నకిలీ టీ 437 బ్యాగులు కనుక్కున్నామన్నారు. 25-30 కిలోల బరువు ఉండే ఒక బ్యాగు విలువ రూ.6 వేలు కాగా మొత్తం స్టాకు నిల్వ రూ.27 లక్షలు విలువ చేయబడునని వారు వివరించారు. ఇంకా మొత్తం కూపీని లాగుతున్నామని, మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. అయితే ఒరిజినల్ కంపెనీ యజమాని స్థానిక అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.