క్రైమ్/లీగల్

గుండెపోటుతో ఉల్లి రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, అక్టోబర్ 12:మండల పరిధిలోని వర్కూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఉల్లి రైతు బోయ చిన్న రాముడు(59) గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న రాముడు గత మూడేళ్లుగా పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాలేదు. ప్రతి ఏటా ఉల్లి పంట సాగు చేస్తూ నష్టపోయిన రాముడు ఈ ఏడాది కూడా ఉల్లికి గిట్టుబాటు ధర లేక కుంగిపోయాడు. ఈ ఏడాది రెండెకరాలు కౌలుకి తీసుకుని ఉల్లి పంట సాగు చేయగా సరైన గిట్టుబాటు ధర దక్కలేదు. ఏటా ఉల్లి పంటను నమ్ముకుని వ్యవసాయం సాగించే ఆ రైతు గ్రామంలో దాదాపు రూ. 6 లక్షల దాకా అప్పులు చేశాడు. దీంతో గత పది రోజుల నుంచి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నాడు. ఈక్రమంలో మరో ఎకరా పొలంలో సాగు చేసిన ఉల్లి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లిన రాముడు పొలంలో పంటకు నీరు పెడుతూ ఉన్నఫళంగా కుప్పకూలి మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కూతళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.