క్రైమ్/లీగల్

ఆపరేషన్ ఇంజక్షన్ వికటించి నిండు గర్భిణి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఠాగూర్ సినిమా తరహాలో డ్రామాలాడిన ప్రభుత్వవైద్యులు
* మృతదేహంతో జాతీయరహదారిపై ప్రజాసంఘాల ఆందోళన
* డీసీహెచ్‌ఎస్, ఎమ్మెల్యే, సీఐల విచారణకు ఆదేశం
* న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే, డీసీహెచ్‌ఎస్
====================================
మదనపల్లె, అక్టోబర్ 12: జిల్లాలో మాతాశిశు సం‘రక్షణ’ కరువైంది. ఏరియా ఆసుపత్రి నుంచి గత ఆర్నెళ్లక్రితం జిల్లా ఆసుపత్రిగా పదోన్నతి పొందిన మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ ఇంజక్షన్ వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. ములకలచెరువు మండలం దేవల్‌చెరువు పంచాయతీ గొల్లవారిపల్లెకు చెందిన గంగాధర్ ధర్మవరం ప్రాంతంలో చేనేత మగ్గం పనులుచేసుకునేవాడు. బీ.కొత్తకోట మండలం నాగన్నకోటకు చెందిన వెంకటరమణ, రవణమ్మల చివరి కుమార్తె వాణితో గంగాధర్‌కు 2005లో వివాహమైంది. దంపతులిద్దరూ వలసపై మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలో ఉంటూ చేనేతమగ్గం పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి 12 ఏళ్ల తర్వాత భార్య గర్భం దాల్చింది. గర్భం మొదటి నుంచి ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్సలు, పరీక్షలు చేయించుకుంటున్నారు. గర్భిణికి ఉమ్మనీరు పోతోందని కుటుంబసభ్యులు, భర్త ప్రైవేట్ వాహనంలో గురువారం సాయంత్రం 5.30గంటలకు మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. రాత్రి 7.45గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళిన వైద్యురాలు మొదటిగా ఇంజక్షన్ వేసింది. వెంటనే శరీరమంతా నవ్వలు వచ్చేశాయి. థియేటర్ లోపల నుంచి సిబ్బంది బయటకు వచ్చి ఇదివరకే మీ భార్యకు మూర్చగానీ, అలర్జీ(నవ్వలు) కానీ ఉన్నాయా అని అడిగి వెంటనే వేడివేడిగా కాఫీ తీసుకురావాలని భర్తకు పురమాయించారు. లోపలికి వెళ్ళిన భర్త గంగాధర్ భార్య వాణికి మనోధైర్యం చెప్పాడు. అప్పటికే భార్య తీవ్ర నవ్వలతో అల్లాడుతోంది. తిరుపతికి తీసుకెళ్ళాలని వైద్యులు సూచించి, వైద్యులే స్వయంగా వాహనాన్ని ఏర్పాటుచేశారు. మళ్లీ తామే వైద్యపరీక్షలు చేస్తామని నమ్మబలికించి ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఠాగూర్ సినిమా తరహాలో సుమారు గంటన్నర సమయంపాటు వైద్యులు, సిబ్బంది నానా హంగామా సృష్టించారు. కొంతసేపటికీ గర్భిణి మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో భర్త, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్య మృతిపై అనుమానం ఉందని, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందే నా భార్యను చంపేశారని వారిపై వాగ్వివాదానికి దిగారు. రాత్రికి రాత్రే గర్భిణి మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించేందుకు యత్నిస్తుండగా భర్త, బంధువులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గర్భిణి మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు.